‘త్రికాల’ దర్శకుడి కొత్త ప్లాన్.. ‘TCU’ యూనివర్స్ తో సరికొత్త ప్రాజెక్టులు!

‘త్రికాల’ దర్శకుడి కొత్త ప్లాన్.. ‘TCU’ యూనివర్స్ తో సరికొత్త ప్రాజెక్టులు!

Published on Aug 12, 2026 11:14 AM IST

Trikala Director Mani Tellaguti

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా చింతాపూడికి చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు మణి తెల్లగూటి. తండ్రి ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తుండటంతో చిన్నతనం నుంచే ఆయనకు సినీ రంగంపై ఆసక్తి ఏర్పడింది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రారంభంలో వీఎఫ్ఎక్స్ (VFX) ఆర్టిస్ట్‌గా, ఎడిటర్‌గా సాంకేతిక అంశాలపై పట్టు సాధించిన ఆయన, ఆ అనుభవంతోనే రచయితగా, దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు.

రాధిక శ్రీనివాస్ నిర్మాణంలో, పవన్ చెన్న ఛాయాగ్రహణంలో మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ‘త్రికాల’ చిత్రం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ మంచి ఆదరణ పొందింది. కాలభ్రమణం, ఆధ్యాత్మికత, వైజ్ఞానిక అంశాల కలయికతో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు.

‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్ (TCU)’ ప్రకటన

ప్రస్తుతం ఈ కథను మరింత విస్తరిస్తూ ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్ (TCU)’ను రూపొందిస్తున్నట్లు మణి తెల్లగూటి వెల్లడించారు. భవిష్యత్తులో రాబోయే సీక్వెల్స్, నూతన ప్రాజెక్టులు అన్నీ ఈ యూనివర్స్ లో భాగంగానే ఉంటాయని తెలిపారు. స్వయంకృషితో సాంకేతిక నిపుణుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మణి తెల్లగూటి జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

తాజా వార్తలు