రవితేజ తరువాత సినిమా అదేనా ?

రవితేజ తరువాత సినిమా అదేనా ?

Published on May 31, 2020 11:59 PM IST


‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని… సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని సమాచారం. త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే.

అన్నట్టు రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే రమేష్ వర్మ సినిమా కంటే కూడా త్రినాథరావ్ నక్కిన సినిమానే ముందు మొదలవుతుందట. ఇక రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. రవితేజ అలాంటి కామెడీ సినిమాతోనే ఈ సారి త్రినాథరావ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు