మరో భారీ ఆఫర్ కొట్టేసిన త్రిప్తి డిమ్రీ!

మరో భారీ ఆఫర్ కొట్టేసిన త్రిప్తి డిమ్రీ!

Published on May 27, 2024 10:31 PM IST

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ఆనిమల్ లో నటించిన త్రిప్తి డిమ్రీ సెన్సేషన్ గా మారింది. తను వరుస సినిమాలతో దూసుకు పోతుంది. అల్ట్రా గ్లామరస్ పాత్రలో నటించి యూత్ లో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. త్రిప్తి కెరీర్‌లో ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అప్పటి నుండి, ఆమె ఆనంద్ తివారీ యొక్క కామెడీ డ్రామా చిత్రం బాడ్ న్యూజ్‌ లో విక్కీ కౌశల్ సరసన, రాజ్‌కుమార్ రావు యొక్క విక్కీ విద్యా కా వో వాలా వీడియో మరియు కార్తీక్ ఆర్యన్ యొక్క భూల్ భులయ్యా 3లో ప్రధాన పాత్రలు పోషించడానికి సంతకం చేసింది.

తాజాగా మరో భారీ ఆఫర్ ను సొంతం చేసుకుంది. కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో వస్తున్న కొత్త చిత్రం లో నటించే అవకాశం వచ్చింది. ధడక్ ఫ్రాంచైజీలోని రెండవ చిత్రం, ధడక్ 2 లో గెహ్రాయాన్ (2022) ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది తో కలిసి త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలో నటించనుంది . షాజియా ఇక్బాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంను ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ మరియు క్లౌడ్9 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది నవంబర్ 2024లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు