బోల్డ్ సీన్స్ పై త్రిప్తి దిమ్రి కామెంట్స్ వైరల్

బోల్డ్ సీన్స్ పై త్రిప్తి దిమ్రి కామెంట్స్ వైరల్

Published on Dec 10, 2023 10:30 PM IST

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన సినిమా యానిమల్. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ‘తృప్తి డిమ్రీ’ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సినిమా చూసిన వారంతా ఈ బ్యూటీ పై కామెంట్స్ చేస్తున్నారు. దాంతో తృప్తి డిమ్రీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది కూడా. ఐతే, యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్‌తో తన రొమాంటిక్ సీన్‌ చూసి తన పేరెంట్స్ ఆశ్చర్యపోవడంతో పాటు కాస్త ఫీలయ్యారని త్రిప్తి దిమ్రి వెల్లడించారు.

‘ఇలాంటివి మేం సినిమాల్లో చూడలేము. నువ్వు ఇలా చేయకూడదు. కానీ ఫర్వాలేదు’ అని వారు చెప్పారని ఆమె తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఒక నటిగా తన పనిని పూర్తి చేశానని చెప్పడంతో వారు అర్థం చేసుకున్నారని త్రిప్తి పేర్కొన్నారు. మొత్తానికి తృప్తి డిమ్రీ బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేసింది. అలాగే, కొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా ఆమె తన గ్లామర్ తో సినిమాకి ప్లస్ అయ్యింది. మొత్తానికి హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. రణబీర్ కపూర్ నటన, భారీ వైల్డ్ యాక్షన్ సీన్స్, బోల్డ్ ఎలిమెంట్స్ కారణంగా ఈ సినిమా మొత్తానికి హిట్ ను సాధించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు