ఫాస్ట్ స్క్రీన్ ప్లే తో ఎంటర్టైన్ చేయనున్న ‘త్రిపుర’

tripura
రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో బాగా సక్సెస్ అయినా ఫార్ములా హర్రర్ కామెడీ.. ఈ వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి, అందులో కొన్ని సక్సెస్ అయితే కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పడు అదే జోనర్లో త్వరలో మనముందుకు రానున్న సినిమా ‘త్రిపుర’. గత ఏడాది వచ్చి హిట్ అయిన ‘గీతాంజలి’ సినిమాకి కొనసాగింపుగా చేసిన సినిమానే ‘త్రిపుర’. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని స్వాతి టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబర్ 6న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

ఇప్పటికే ఫైనల్ కాపీని సిద్దం చేసుకున్న ఈ చిత్ర టీం ఇటీవలే ఫైనల్ వెర్షన్ చూసుకొని అవుట్ పుట్ విషయంలో చాలా సంతృప్తి గా ఉన్నారు. ముఖ్యంగా ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి బిగ్గెస్ట్ హెల్ప్ అవుతుందని సమాచారం. ఈ ఫాస్ట్ స్క్రీన్ ప్లేకి జోడించిన కామెడీ అందరినీ బాగా నవ్విస్తుందని అంటున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ సినిమాకి తమిళంలో ‘తిరుపుర సుందరి’ టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. గీతాంజలి సినిమాలానే ఈ సినిమాకి కథ- మాటలు అందించడమే కాకుండా సహా నిర్మాతగా కూడా ప్రముఖ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నాడు. యంగ్ హీరో నవీన్ చంద్ర ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ సినిమాని చినబాబు – రాజశేఖర్ కలిసి నిర్మించగా, రాజ్ కిరణ్ దర్శకత్వం వహించాడు.

Exit mobile version