
దశాబ్ద కాలంగా సౌత్ ఇండియన్ ఆడియన్స్ ని మెప్పిస్తున్న స్టార్ హీరోయిన్ త్రిష. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న త్రిష ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించినా, చేసే కొద్ది సినిమాలు మాత్రం స్టార్స్ తో చేస్తూ బిజీగా ఉంది. తాజాగా కోలీవుడ్ లో త్రిష త్వరలోనే రాజకీయాలలో ఎంటర్ కానుందని, అది కూడా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్టీ అయినా ఎఐఎడిఎంకె పార్టీలో చేరనుందనే వార్తలు వసున్నాయి. జయలలితని అమితంగా అభిమానించే త్రిష తన పార్టీలో చేరనుందనే వార్తలు వచ్చాయి.
ఈ వారాలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడంతో త్రిష ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది. ‘ప్రస్తుతం వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను రాజకీలయలోకి రావడం లేదు, అలాగే ఏ పార్టీలోనూ చేరడం లేదు. ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా రాబోయేది లేదని’ త్రిష తెలిపింది. త్రిష తేల్చి చెప్పేయడంతో ఈ వార్తలకి తెరపడింది. ప్రస్తుతం పలు తమిళ సినిమాలతో బిజీ గా ఉన్న త్రిష లేటెస్ట్ మూవీ ‘సకల కళా వల్లభన్’ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

