పెట్టా షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రముఖ హీరోయిన్ !

పెట్టా షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రముఖ హీరోయిన్ !

Published on Oct 22, 2018 5:00 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘పెట్టా’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ త్రిష ఒక ముఖ్య పాత్రలో నటిస్తుందని తెలిసిందే. తాజాగా ఆమె తన పాత్ర తాలూకు షూటింగ్ ను కంప్లీట్ చేసింది.

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ , విజయ్ సేతుపతి , నవాజుద్దిన్ సిద్దిఖీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు