
సన్నిహిత మిత్రులు, స్నేహితులతో కలసి పార్టీ చేసుకోవడం అంటే త్రిషకు మహా సరదా. హీరోయిన్ గా కెరీర్ కొనసాగించిన ఈ దశాబ్ద కాలంలో ఎన్ని సినిమాలలో నటించిందో, అంత కంటే ఎక్కువ నైట్ పార్టీలు, వివాదాలతో వార్తలలో నిలిచింది. వాటిని పట్టించుకోకుండా తన పని తానూ చేసుకుపోవడం, ఎంజాయ్ చేయడం మాత్రమే ఈ అమ్మడికి తెలిసిన విద్య.
తాజాగా తన స్నేహితులతో కలసి ఆగ్రా వెళ్ళింది. ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహల్ ను సందర్శించి సరదాగా గడిపింది. చిందులు వేస్తూ ఫోటోలు కూడా దిగింది. ‘బ్యూటిఫుల్ తాజ్ మహల్..’ అంటూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పోస్ట్ చేసింది.
ఇటీవలే తన చిరకాల ప్రేమికుడితో విడిపోయిందంటూ త్రిషపై పుకార్లు చెలరేగాయి. అలాగే నిర్మాత వరుణ్ మణియన్ తో నిశ్చితార్ధం జరిగిందంటూ ప్రచారం కూడా జరిగింది. వరుణ్ మణియన్ తో తాజ్ మహల్ సందర్శించడం హాట్ టాపిక్ అయ్యింది. ఏది ఏమైనా ఎలా ఎంజాయ్ చేయాలో త్రిషను చూసి నేర్చుకోవాలి.

