‘నాయకి’గా భయపెట్టనున్న త్రిష

trisha
దశాబ్ద కాలంగా సౌత్ ఇండియాలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న అందాల భామ త్రిష. తెలుగు, తమిళ, కన్నడ భాషలలోని స్టార్ హీరోలందరితో నటించడమే కాకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ మధ్య కాలంలో త్రిష జోరు తగ్గింది అంటున్నారు, కానీ త్రిష ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయడం తగ్గించినా స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. త్రిష నందమూరి బాలకృష్ణ సరసన నటించిన ‘లయన్’ సినిమా మే 8న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దముతోంది.

ఇదిలా ఉంటే త్రిష ఇన్నేళ్ళ కెరీర్లో ఇప్పటి వరకూ చేయని ఓ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ కి సైన్ చేసిందని ఇది వరకే తెలియజేశాం. త్రిష పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టీం ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసారు. త్రిష లేడీ ఓరియెంటెడ్ హర్రర్ సినిమాకి ‘నాయకి’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకి తెలుగులో ‘లవ్ యు బంగారం’ సినిమా చేసిన గోవి దర్శకత్వం వహించనున్నాడు. ‘లక్ష్మీరావే మా ఇంటికి’ సినిమా తీసిన మామిడిపల్లి గిరిధర్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇదే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న తమిళ పొన్ను త్రిషకి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version