‘నాయకి’గా సిద్ధమవుతోన్న త్రిష

‘నాయకి’గా సిద్ధమవుతోన్న త్రిష

Published on Aug 18, 2015 11:35 PM IST

Trisha1
తెలుగు, తమిళం, హిందీ ఇలా ఏ భాష అనేది సంబంధం లేకుండా అన్ని భాషల్లో స్టార్‌డమ్ సంపాదించుకున్న నటి త్రిష. ఇండస్ట్రీకి వచ్చి పదమూడేళ్ళైనా ఇప్పటికీ అదే ఉత్సాహంతో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న త్రిష, ‘నాయకి’ పేరుతో ఓ హర్రర్ కామెడీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాకు గోవి దర్శకుడు. హర్రర్ కామెడీకి తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ఆ కోవలో ఓ మంచి సినిమాగా నిలుస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు త్రిష.

ఇక నాయకి సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఒకటి ఈ రోజే విడుదల కాగా, ఈ ఫస్ట్‌లుక్‌కు అంతటా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్ స్టైల్‌లో కనిపిస్తోన్న త్రిషకు అభినందనలు వెల్లువెత్తాయి. తనను నమ్మి ఇలాంటి పాత్రను ఇచ్చినందుకు దర్శకుడికి థ్యాంక్స్ చెబుతూ ఈ సినిమా ద్వారా తన కెరీర్లో మరో మంచి పాత్ర రానుందకు సంతోషంగా ఉందని తెలిపారు. రఘు కుంచె ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు