కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ మళ్ళీ కామిక్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కామెడీ పాత్రల కోసం వరుసగా సినిమాల అంగీకరిస్తున్నాడు. వాటిలో జూ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఒకటి.
తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం షూటింగ్ లో సునీల్ ఈ రోజు పాల్గొన్నాడు. సునీల్ దర్శకుడు త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన స్నేహితుడి కోసం త్రివిక్రమ్ ఓ ఆసక్తికరమైన పాత్రను సృష్టించాడు. పైగా సునీల్ పాత్ర సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర అని తెలుస్తోంది. కేవలం నవించడానికే కాకుండా కథకు ఈ పాత్ర చాలా కీలకం కానుందట.
ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


