మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా రచనలో తన శైలి మార్చాడట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ తన రైటింగ్ గురించి మాట్లాడుతూ.. గత తన సినిమాల్లో ఆడవారి క్యారెక్టర్స్ ఎక్కువుగా అమాయికంగా, పెద్దగా ఏమి తెలియనివారిగా ఉండేవని.. దానికి కారణం తాను పుట్టి పెరిగిన వాతావరణం, తాను ఎక్కువుగా అబ్జర్వ్ చేసిన ఆడవారే కారణం అని ఈ మాటల మాంత్రికుడు తెలిపారు. ప్రస్తుతం సమాజంలో స్త్రీల పాత్ర ప్రధానమైనదని.. అది దృష్టిలో పెట్టుకునే. అరవింద సమేతలో స్త్రీల ప్రాముఖ్యతకు ఎక్కువ ప్రాధానణ్యత ఇచ్చామని చెప్పుకొచ్చారు.
అలాగే తన రైటింగ్ స్టైల్ ను కూడా మార్చినట్లుగా చెప్పారు. తాను ప్రస్తుతం థాట్ ని మాత్రమే డైలాగ్ గా రాస్తున్నాను.. నిజానికి ప్రాసలను పంచ్ లను రాయడం ఎప్పుడో మానేశానని అన్నారు. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయబోతున్నాడని ఫిల్మ్ వర్గాల టాక్.
