త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ కొత్తగా !

Published on Feb 2, 2019 12:08 pm IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత వీరిద్దరూ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

కాగా ఈ సినిమా ఫిబ్రవరి సెకెండ్ వీక్ నుండి షూట్ కి వెళ్ళబోతుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో బన్నీ సరసన నటించే హీరోయిన్నీ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ ను కాస్త వైవిధ్యంగా చూపించాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే త్రివిక్రమ్ సూచన మేరకు బన్నీ కాస్త వెయిట్ తగ్గపోతున్నాడట. అలాగే హెయిర్ స్టైల్ కూడా మార్చబోతున్నాడట. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కూడా బన్నీ మాడ్యులేషన్ని కాస్త కొత్తగా మార్చాడు త్రివిక్రమ్.

సంబంధిత సమాచారం :