త్రివిక్రమ్ క్రేజ్ కి ఇదే నిదర్శనం..!

త్రివిక్రమ్ క్రేజ్ కి ఇదే నిదర్శనం..!

Published on Jan 3, 2020 7:09 AM IST

ala

టాలీవుడ్ లో కొందరు దర్శకులకు హీరో స్థాయి గుర్తింపు, క్రేజ్ ఉంటుంది. అలాంటి దర్శకులలో త్రివిక్రమ్ ఒకరు. మాటల మాంత్రికుడిగా అందరూ ముచ్చటగా పిలుచుకునే త్రివిక్రమ్ డైలాగ్స్ అతని టేకింగ్ కు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గిలిగింతలు పెట్టేలా హాస్యం.. వాస్తవికతకు దగ్గరగా ఉండే జీవిత సత్యాలు ఆయన డైలాగ్స్ లో ప్రతిబింబిస్తాయి. తాజాగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో అల వైకుంఠపురంలో అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ హైప్ మధ్య సంక్రాంతి కానుకగా విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధించిన కట్ ఔట్స్ అప్పుడే తెలుగు రాష్ట్రాలలో దర్శనమిస్తున్నాయి. ఐతే ఆశ్చర్యకరంగా బన్నీ భారీ కట్ ఔట్ పక్కనే త్రివిక్రమ్ కట్ ఔట్ కనిపించడం ఆసక్తి రేపుతోంది.ఇది చూసిన త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఫిదా ఐపోతున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తుండగా..టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అల వైకుంఠపురంలో విడుదల తేదీపై సందిగ్దత కొనసాగుతుంది. గతంలో ఈ చిత్ర విడుదల తేదీ జనవరి 12అని నిర్ణయించారు. ఐతే కొంచెం ముందే జనవరి 10న విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు