‘అల వైకుంఠపురములో’.. కథను రివీల్ చేసిన త్రివిక్రమ్ !

‘అల వైకుంఠపురములో’.. కథను రివీల్ చేసిన త్రివిక్రమ్ !

Published on Jan 5, 2020 7:56 PM IST

Trivikram Srinivas

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా కథ గురించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ఈ సినిమా కథాంశాన్ని రివీల్ చేశారు. ఈ సినిమాని వినోదభరితమైన నేపథ్యంలో సంపదకి గొప్పతనానికి మధ్య వ్యత్యాసాన్ని చూపించనున్నారట. సంపద వల్ల వచ్చే అందమైన వాతావరణంతో సౌకర్యవంతమైన భోగాలు కొంతకాలం మాత్రమే మనలను మంత్రముగ్దులను చేస్తాయని.. ఆ తరువాత అవి మనల్ని ఆకట్టుకోపోగా వాటి వల్ల కొన్ని సందర్భాల్లో విసుగు చెందుతామని.. అదే గొప్పతనం వల్ల ఎప్పటికీ గౌరవం, సంతృప్తి ఉంటూనే ఉంటాయని అదే అంశాన్ని ఈ సినిమాలో చెప్పబోతున్నట్లు త్రివిక్రమ్ తెలిపారు.

కాగా బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు