మీడియాలో చక్కర్లు కొడుతున్న క్రేజీ కాంబినేషన్

మీడియాలో చక్కర్లు కొడుతున్న క్రేజీ కాంబినేషన్

Published on Jun 17, 2015 10:00 AM IST

Samantha-trivikram
‘S/O సత్యమూర్తి’ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పలువురు హీరోలతో సినిమాలు చేస్తాడు అని చెప్పినా ఏ ఒక్కటీ ఇంకా ఖరారు కాలేదు. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ – అందాల భామ సమంత కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నారని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా లో బడ్జట్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కానీ ఈ న్యూస్ మాత్రం అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది. మూడోసారి ఈ వీరిద్దరూ కలిసి సూపర్ హిట్ మేజిక్ ని రిపీట్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. త్రివిక్రమ్ – సమంత కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది, S/O సత్యమూర్తి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. సమంత కూడా మంచి కథ దొరికితే లేడీ ఓరియెంటెడ్ సినిమా చెయ్యాలనే ఆసక్తి ఉందని తెలిపింది. సమంత ప్రస్తుతం పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటె త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేసే అవకాశం కూడా ఉందని పలు రూమార్స్ వస్తున్నాయి.

తాజా వార్తలు