త్రివిక్రమ్ మెగా సినిమా చేయాలట !

Published on Sep 19, 2020 3:45 pm IST

త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబినేషన్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోన్నా.. ఈ కాంబినేషన్ నుండి ఇంతవరకూ సినిమా చేస్తోనట్లు ఎలాంటి అప్ డేట్ లేదు. మెగా ఫ్యాన్స్ డ్రీమ్ కాంబినేషన్స్ లో ఈ కాంబినేషన్ కూడా ఒకటి అయినా, ఈ కాంబినేషన్ సెట్ అయితే ఎంతో క్రేజ్ వస్తోందన్నా.. త్రివిక్రమ్ మాత్రం మెగాస్టార్ తో సినిమా చేయడానికి ప్రస్తుతానికి ఎలాంటి సన్నాహాలు చేయడం లేదు. ఎప్పటికైనా త్రివిక్రమ్ తో మెగాస్టార్ సినిమా చేస్తే చూడాలనేది మెగా ఫ్యాన్స్ కోరిక. కానీ ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమా తరువాత, త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేస్తాడని ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ కు ఒక లైన్ కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే మెగా ఫ్ఫ్యాన్స్ మాత్రం త్రివిక్రమ్ – మెగాస్టార్ కలయికలో సినిమా రావాలని సోసల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. పైగా వీరి కలయికలో ఫుల్ కమర్షియల్ ఎంటెర్టైనర్ సినిమా రావాలని, ఎలాగూ త్రివిక్రమ్ సినిమా అంటే.. ఎమోషన్ అండ్ యాక్షన్ తో పాటు హీరో ఖచ్చితంగా కామెడీ కూడా చేస్తాడు. ఇక హాస్యాన్ని పండించడంలో మెగాస్టార్ ను మించినోళ్లు లేరు. అందుకే ఈ ఇద్దరి కలయికలో ఫుల్ ఎంటెర్టైనర్ గా మెగా సినిమా రావాలని మెగా ఫ్యాన్స్ పోస్ట్ పెడుతున్నారు.

సంబంధిత సమాచారం :

More