‘అరవింద సమేత’ టీజర్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న త్రివిక్రమ్ !

‘అరవింద సమేత’ టీజర్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న త్రివిక్రమ్ !

Published on Jul 7, 2018 6:00 PM IST

aravinda sametha
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత ‘చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పుడు అందరి చూపులు ఈ చిత్ర టీజర్ పైనే ఉన్నాయి . ఎన్టీఆర్ అభిమానులైతే టీజర్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ టీజర్ ఫై చిత్ర దర్శకుడు స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో చిత్రం ఫై అంచనాలను భారీ గా పెంచేసాడు. ఇప్పుడు ఈ టీజర్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు సిద్దమవుతున్నాడు త్రివిక్రమ్. టీజర్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించే సన్నివేశాలు ఉండేలా చూసుకుంటున్నాడట. ఇక ఈ చిత్ర టీజర్ ఆగష్టు నెలలో రిలీజ్ కానుందని సమాచారం .

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శుభలేఖ సుధాకర్ , జగపతిబాబు , నాగబాబు , లు వంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం విజయ దశమి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు