‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి త్రివిక్రమ్ స్టాంప్.. హిట్ గ్యారెంటీ!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి త్రివిక్రమ్ స్టాంప్.. హిట్ గ్యారెంటీ!

Published on Aug 12, 2026 8:02 AM IST

ఈ వారంలో థియేటర్స్ లో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా ఒకటి. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ తమిళ్ సినిమా తెలుగు డబ్బింగ్ లో కూడా రాబోతుంది.

అయితే ఈ చిత్రం గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న జరగగా ఈ సినిమా రిజల్ట్ పై నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు. తమ ఆస్థాన దర్శకుడు త్రివిక్రమ్ గారికి ఈ సినిమా చూపించామని సినిమా త్రివిక్రమ్ గారికి చాలా నచ్చింది అని తమ బ్యానర్ లో త్రివిక్రమ్ గారికి చూపించి ఆయనకి నచ్చిన ప్రతీ సినిమా ఫెయిల్ అవ్వలేదు అని కన్ఫర్మ్ చేశారు. సో అలానే విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా హిట్ గ్యారెంటీ అని త్రివిక్రమ్ స్టాంప్ తో ఫ్యాన్స్ కి ఒక భరోసా అందించారు. సో సినిమా ఎలా ఉంటుంది అనేది ఈ 14తో తేలిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు