‘అల వైకుంఠపురములో’ కథ ఎలా పుట్టిందో తెలుసా

‘అల వైకుంఠపురములో’ కథ ఎలా పుట్టిందో తెలుసా

Published on Jan 5, 2020 1:09 PM IST

ala Vaikunthapuramlo

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే అందులో ఖచ్చితంగా తెలుసుకోవలసిన జీవిత సత్యం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అసలు ఆయన కథలు దాదాపు ఆ సత్యాల నుండే పుడుతుంటాయి. అయన కొత్త చిత్రం ‘అల వైకుంఠపురములో’ కథ కూడా అలా బీజం వేసుకున్నదేనట. ‘ఎవరికైనా స్థానం ఇవ్వగలమేమోకా గానీ స్థాయిని ఇవ్వలేం’ అనేదే కథా బీజం.

ఈ మాటను త్రివిక్రమ్ మాటల్లో వివరిస్తే ‘సంపద, ఐశ్వర్యం వేరు వేరు. గొప్పింట్లోకి వెళితే కాసేపటికి బోర్ కొట్టేస్తుంది. అదే మధ్యతరగతి ఇంట్లో అన్నీ దొరుకుతాయి. అక్కడ సంపద ఉంటే, ఇక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఈ అంశాన్నే సరదాగా చెప్పాలనుకుని ఈ కథ రాశారట ఆయన. వినడానికే గొప్పగా అనిపిస్తున్న ఈ కథ ఇక తెరపై ఎలా ఉంటుందో జనవరి 12న చూడొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు