మెగాస్టార్ తో ఫుల్ కమర్షియల్ ఎంటెర్టైనర్ చేస్తాడట !

Published on Mar 13, 2020 1:01 am IST

మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోన్న వారి డ్రీమ్ కాంబినేషన్స్ లో త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబినేషన్ కూడా ఒకటి. పైగా ఈ కాంబినేషన్ అంటే సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. అందుకే ఎప్పటికైనా త్రివిక్రమ్ తో మెగాస్టార్ సినిమా చేస్తే చూడాలనేది మెగా ఫ్యాన్స్ కోరిక. కాగా ఆ కోరిక భవిష్యత్తులో తీరేలా ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమా తరువాత, త్రివిక్రమ్ మెగాస్టార్ తో సినిమా చేస్తాడట. అయితే ఆ సినిమా చేస్త గనుక ఫుల్ కమర్షియల్ ఎంటెర్టైనర్ లా చేస్తానని త్రివిక్రమ్ తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక త్రివిక్రమ్ సినిమా అంటే.. ఎమోషన్ అండ్ యాక్షన్ తో పాటు హీరో ఖచ్చితంగా కామెడీ చేయాల్సిందే. ఇక హాస్యాన్ని పండించడంలో మెగాస్టార్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఎంటెర్టైనర్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడానికే థ్రిల్ గా అనిపిస్తోంది. ఇకపోతే చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా ‘అల వైకుంఠపురములో’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తారక్ సినిమా కోసం స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :

More