త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తరువాత మెగాస్టార్ తోనే !

త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తరువాత మెగాస్టార్ తోనే !

Published on Feb 24, 2020 1:13 PM IST

మెగా ఫ్యాన్స్ ఊహల్లోని డ్రీమ్ కాంబినేషన్లలో త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబినేషన్ ఒకటి. పైగా ఎంతో క్రేజ్ తో కూడుకున్నది. ఎప్పటికైనా త్రివిక్రమ్ తో మెగాస్టార్ సినిమా చేస్తే చూడాలనేది మెగా ఫ్యాన్స్ కోరిక. ఆ కోరిక భవిష్యత్తులో తీరేలా ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమా తరువాత మెగాస్టార్ తో సినిమా చేస్తాడట. మెగాస్టార్ కి త్రివిక్రమ్ గతంలో ఒక ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడట, ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా వంద శాతం కమర్షియల్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది.

ఇక త్రివిక్రమ్ సినిమా అంటే.. ఎమోషన్ అండ్ యాక్షన్ తో పాటు హీరో ఖచ్చితంగా కామెడీ చేయాల్సిందే. ఇక హాస్యాన్ని పండించడంలో మెగాస్టార్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఎంటెర్టైనర్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడానికే థ్రిల్ గా అనిపిస్తోంది.

ఇకపోతే చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా ‘అల వైకుంఠపురములో’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన స్థాయి ఏంటో మరోసారి చాటి చెప్పాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు