ఆ ట్రోల్స్ వల్లే తన సోషల్ మీడియా అకౌంట్ డీయాక్టివ్ చేసిన యువన్..?

ఆ ట్రోల్స్ వల్లే తన సోషల్ మీడియా అకౌంట్ డీయాక్టివ్ చేసిన యువన్..?

Published on Apr 18, 2024 3:11 PM IST


మన సౌత్ ఇండియా సినిమా దగ్గర తన మ్యూజిక్ తో అలరించిన టాలెంటెడ్ సంగీత దర్శకుల్లో మ్యాస్ట్రో ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా కూడా ఒకడు. తెలుగు సహా తమిళ్ లో ఎన్నో చిత్రాలకి ఐకానిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు అలాగే అదిరే సాంగ్స్ ని కూడా కంపోజ్ చేసిన తాను లేటెస్ట్ గా ఇచ్చిన సాంగ్ నే ‘విజిల్ పోడు’.

దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయగా దానికి అనుకున్న రేంజ్ రెస్పాన్స్ అయితే రాలేదు.

దీనితో ట్రోల్స్ కూడా గట్టిగా పడ్డాయి. అయితే లేటెస్ట్ గా యువన్ తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డీయాక్టివేట్ చేయడం వైరల్ గా మారింది. దీనితో ఆ సాంగ్ ట్రోల్స్ మూలానే యువన్ ఈ పని చేసాడని కొందరు ఫిక్స్ అయ్యిపోయారు. మరి తెలుగులో అయితే మాస్ అండ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తో “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు