చేయని తప్పుకు పూజాకు శిక్ష.!

Published on May 28, 2020 7:18 pm IST

మన టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తక్కువ కాలంలోనే మంచి స్టార్డం ను అందుకున్న తక్కువమంది హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో పూజా నటించిన సినిమాలే కొన్ని ఉన్నాయి. అయితే తాజాగా పూజా హెగ్డే తాలూకా సోషల్ మీడియా విభాగపు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవ్వడం సెన్సేషన్ అయ్యింది.

పైగా టాలీవుడ్ మరో స్టార్ హీరోయిన్ సమంతపై పెట్టిన పోస్ట్ మరింత కలకలం రేపింది. దీనితో తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని తెలుసుకొనే లోపే ఆ పోస్ట్ చూసిన సోషల్ మీడియా వీక్షకులు పూజా పై ట్రోల్స్ వెయ్యడం మొదలు పెట్టేసారు. దీనితో పూజా తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని తన టీం దానిని రికవర్ చేసే పనిలో ఉన్నారని తెలిపి అసలు వివరణ ఇచ్చింది.

సంబంధిత సమాచారం :

More