వైరల్ అవుతున్న మహేష్, కృష్ణ త్రో బ్యాక్ పిక్

Published on May 26, 2020 1:38 pm IST

ప్రయోగాలకు పెద్ద పీట వేసిన స్టార్ హీరో కృష్ణ అప్పట్లో ప్రేక్షకులకు కథల పరంగా, సాంకేతికత పరంగా కొత్త అనుభూతిని పంచేవారు. ఇక ఆయన నటవారసుడిగా వెండితెరకు పరిచయమైన మహేష్ తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఆయన టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోగా ఎదిగాడు. కాగా కృష్ణ గారు కొంచెం వయసులో ఉన్నప్పుడు మహేష్ సినిమాకు సంబందించిన ఓ ఆడియో వేడుకకు హాజరయ్యారు. ఆ సమయంలో మహేష్, కృష్ణల మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈనెల 31న కృష్ణ గారి పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ ఘనంగా వేడుకలు జరపాలని భావించారు. ఐతే కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణించి ఏడాది కూడా పూర్తి కానీ కారణంగా ఆయన వేడుకలను నిరాకరించారు. కాగా మహేష్ తన నూతన చిత్ర ప్రకటన చేస్తారు అనే మాట గట్టిగా వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More