ట్రూ లవర్ డిజిటల్ ప్రీమియర్ డేట్ ఫిక్స్?

ట్రూ లవర్ డిజిటల్ ప్రీమియర్ డేట్ ఫిక్స్?

Published on Feb 15, 2024 11:02 AM IST

జై భీమ్ మరియు గుడ్ నైట్ చిత్రాలలో తన పాత్రలకు పేరుగాంచిన మణికందన్ మరియు MAD ఫేమ్ నటి శ్రీ గౌరీ ప్రియ రీసెంట్ గా తెలుగులో ట్రూ లవర్‌ మూవీ కోసం జత కట్టారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ పై సోషల్ మీడియాలో బజ్ నెలకొంది. ఈ చిత్రం మార్చి 8, 2024న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కన్నా రవి, శరవణన్, గీతా కైలాసం, హరీష్ కుమార్, నిఖిలా శంకర్ మరియు రిని కీలక పాత్రల్లో నటించారు. నజెరత్ పసిలియన్, మగేష్ రాజ్ పసిలియన్, యువరాజ్ గణేశన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సీన్ రోల్డన్ సంగీతం సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు