‘టక్ జగదీష్’ జూన్ లో ప్లాన్ చేస్తున్నాడట !

‘టక్ జగదీష్’ జూన్ లో ప్లాన్ చేస్తున్నాడట !

Published on Mar 28, 2020 12:00 AM IST

టాలీవుడ్ లోని మినిమం గ్యారంటీ హీరోల్లో ఒకరైన నేచురల్ స్టార్ ‘నాని’ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఆ ఇద్దరి కాంబినేషనులో తయారవుతున్న సినిమా ఇది. షైన్ స్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నానికి 26వ చిత్రం. కాగా నాని ఈ సినిమాలో కొత్త లుక్ ట్రే చేస్తున్నాడట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 6 నుంచి మొదలు కానుంది.

ఇక ఈ సినిమలో తారాగణం విషయానికి వస్తే. నానితో ఇదివరకు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన రీతు వర్మ, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. మరి నిన్నుకోరితో హిట్ అందుకున్న ఈ హిట్ కాంబినేషన్ ఆ హిట్ మేజిక్ ను రిపీట్ చేస్తోందా..? చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు