కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ తరంలో టేస్ట్ వున్న నిర్మాతగా సాయి కొర్రపాటి ప్రశంసలు అందుకుంటున్నాడు. లెజెండ్ వంటి కమర్షియల్ సినిమాకు, ఈగ వంటి ప్రయోగాత్మక చిత్రానికి, ఊహలు గుసగుసలాడే వంటి రొమాంటిక్ సబ్జెక్ట్ కి ఆయన పచ్చ జెండా ఊపిన తీరు దీనికి ఉదాహరణ. ఈ నిర్మాత మరోసారి ఒక కొత్త దర్శకుడిని హీరోని పరిచయం చేస్తూ ‘తుంగబధ్ర’ అనే సినిమాతో మనముందుకు రానున్నారు.
ఈ చిత్ర ఆడియో విడుదల సందర్భంగా విచ్చేసిన రాజమౌళి తనకూ తుంగబధ్ర నదికి ప్రత్యేక అనుబంధముందని, సినిమాలో పాటలు ఆకట్టుకుంటాయని, పాతక సన్నివేశాలు అద్భుతంగ వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. రాయలసీమ ప్రాంతాలలో జరిగే రివెంజ్ డ్రామాని క్యూట్ లవ్ స్టోరీలో మిక్స్ చేసినట్టు తెలుస్తుంది. శ్రీనివాస్ కృష్ణ గోగినేని దర్శకుడు. డింపుల్, అదిత్ నటీనటులు ..
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి