టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “యానిమల్”?

టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “యానిమల్”?

Published on Nov 28, 2023 10:07 PM IST


బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ యానిమల్. ఈ చిత్రం డిసెంబర్ 1, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో అనిల్ కుమార్, బాబీ డియోల్, పృధ్వీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు