ప్రస్తుతం నగరాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అన్ని సౌకర్యాలతో, సరసమైన ధరలతో పెట్టుబడికి అందరూ వెతుకుతూ ఉంటారు. ఇన్వెస్టర్స్ కూడా అందుకు అనుగుణంగా వివిధ రకాల ప్రాజెక్ట్ లను సందర్శించి, తగిన నిర్ణయం తీసుకుంటారు. ఇళ్లను కొనుగోలు చేయాలి అనుకున్న వారి అభిరుచికి అనుగుణంగా దొరికితే వారి సంతోషం అంతా, ఇంతా కాదు.
అయితే ఫ్యూచర్ లో సొంత ఇంటిని కొనుగొలు చేయాలని చూస్తున్న వారికి, ఇన్వెస్ట్ చేయాలని అనుకున్న వారికి TV9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో హైదరాబాద్ ఈవెంట్ ఉపయోగపడుతుంది. ఇండియా లోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన TV9 నెట్‌వర్క్ హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, మైసూరు, మంగళూరుతో సహా ఇండియా లోని ప్రధాన నగరాలు, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల్లో ఎక్స్‌పోస్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో చివరి TV9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో నవంబర్ 2022లో నిర్వహించబడింది.
20 వేల కంటే ఎక్కువ ఫుట్‌ఫాల్స్‌ను చూసింది. మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేయడం జరిగింది.
TV9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో హైదరాబాద్ లోని ఏప్రిల్ 14, 15, 16 తేదీలలో హై టెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైటెక్ సిటీ, హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ ఈవెంట్ లో రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ఫర్నిషింగ్ బ్రాండ్స్, ఇంటీరియర్ డిజైనర్లు లు పాల్గొననున్నారు. అంతేకాక ఈ ఆర్థిక సహాయం పొందాలనుకునే కస్టమర్లు, బ్యాంకులు అందించే రుణాల వివరాలను ఎగ్జిబిటర్ల ద్వారా తెలుసుకోవచ్చు.
Date: April 14 th , 15 th & 16 th , 2023
Venue: Hitex Exhibition Centre, Hi-Tech City
