
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రీజీ కాంబినేషన్ లో వచ్చే సినిమాల గురించి, హీరోల గురించే కాకుండా ఎక్కువగా వినిపిస్తున్న హాట్ టాపిక్ మా ఎలక్షన్స్.. మా అధ్యక్ష పదవికి సీనియర్ నటులైన రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీ పడ్డారు. మా ఆర్టిస్ట్ అసోషియేషన్ లో ఎక్కువ మంది జయసుధ వైపు నిలబడినా రాజేంద్ర ప్రసాద్ డేర్ చేసి పోటీలో నిలబడ్డాడు. ఈ మా ఎలక్షన్స్ జరిగి చాలా రోజులైంది. ఇటీవలే హై కోర్టు ఈ మా ఎలక్షన్స్ రిజల్ట్స్ ని ఈ రోజు రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేసింది.
ఈ రోజు రిజల్ట్స్ కోసం సినీ పరిశ్రమ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తోంది. కానీ మా రిజల్ట్స్ విషయంలో కోర్టు మరో చిన్న ట్విస్ట్ ఇచ్చింది. ఈ రోజు ఇరు పక్షాల వాదనలు విన్న హై కోర్టు రిజల్ట్స్ ని ఏప్రిల్ 15కి వాయిదా వేసింది. అంతే కాకుండా ఏప్రిల్ 15న రిజల్ట్స్ అనౌన్స్ చెయ్యడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ ని కూడా కూడా కోర్టు నియమించింది. మా అసోషియేషన్ రిజల్ట్స్ ఇలా వాయిదా పడడం ఇది మూడవసారి కావడం విశేషం. ప్రస్తుతం మురళీ మోహన్ మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నెల 15న మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే కొత్త నాయకుడు ఎవరనేది చూడాలి.

