ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీలు నిరాశ పరిచాయా…?

ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీలు నిరాశ పరిచాయా…?

Published on Sep 13, 2019 8:19 PM IST

ఎపిసోడ్స్ పెరిగే కొద్దీ బిగ్ బాస్ హౌస్ ఆసక్తికరంగా మారుతుంది. ఉత్కంఠ రేపే టాస్కులు హౌస్ మేట్స్ మధ్య అగ్గి రాజేస్తున్నాయి. ఐతే ఈ సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశించిన ఇద్దరు కంటెస్టెంట్ లు నిరాశ పరిచినట్లు తెలుస్తుంది. మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశించిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి తన ప్రవర్తన మరియు పరుష పదజాలం వలన కొద్దిరోజులకే తిరస్కరణకు గురై హౌస్ నుండి వెళ్లిపోవడం జరిగింది.

ఇక రెండవ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన ప్రముఖ యాంకర్ మరియు నటి శిల్పా చక్రవర్తి ప్రవర్తన కూడా అంత ఆశాజనకంగా లేదు. ఆమె హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుండి ఎవరితోనూ క్లోజ్ గా ఉండడానికి ఇష్టపడడంలేదు అంతేకాకుండా ఓట్లు పరంగా కూడా ఆమెకు తక్కువే వచ్చినట్టు తెలుస్తుంది. దాంతో ఈ వారం శిల్ప నే హౌస్ నుండి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశించిన సభ్యులు ఇద్దరు బిగ్ బాస్ షో కి అంతగా ఉపయోగపడలేదని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు