
‘చిన్నదానా నీకోసం’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ ఈ గ్యాప్ లో అక్కినేని అఖిల్ ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ బిజీగా ఉన్నాడు నితిన్. ఈ సినిమా చివరి దశకు చేరుకోవడంతో నితిన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాని ఆగష్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదట్లో అధికారికంగా ప్రారంభం కానుంది. అలాగే అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టి 2016 సమ్మర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథ ప్రకారం ఇందులో ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడని సమాచారం. అందులో ఇప్పటికే మొదటి హీరోయిన్ గా సమంతని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. మరో వైపు ఇంకో హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు. హీరోయిన్స్ తో పాటు ఈ సినిమా కోసం తమిళంలో ట్రెండ్ సెట్ చేస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాని హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నాడు. ఇది కాకుండా నితిన్ నటించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.