రెండొందల కోట్లు ఏదో ఒకరోజు కొడతా – విజయ్ దేవరకొండ

రెండొందల కోట్లు ఏదో ఒకరోజు కొడతా – విజయ్ దేవరకొండ

Published on Apr 3, 2024 12:00 AM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అందాల నటి మృణాల్ ఠాకూర్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీని పరశురామ్ పెట్ల తెరకెక్కించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఇటీవల ఈమూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని అందర్నీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక నేడు ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లో గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, తన ఫస్ట్ మూవీ నుండి ఫ్యాన్స్, ఆడియన్స్ తనపై చూపుతున్న ఆదరణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలానే గతంలో తాను ఒక సందర్భంలో కెరీర్ పరంగా రూ. 200 కోట్ల కలెక్షన్ కొడతానని ధైర్యంగా చెప్పానని, అయితే అలా చెప్పడం తప్పు కాదు కానీ, కొట్టకపోవడం తప్పని అన్నారు. ఖచ్చితంగా రూ. 200 కోట్లు ఏదో ఒక రోజు కొడతాను, అయితే అప్పటివరకు ఎన్ని తిట్లు అయినా పడతాను, ఇది యారొగెన్స్ కాదు కాన్ఫిడెన్స్ అని అన్నారు. మొత్తంగా తమ టీమ్ అంతా ఎంతో కష్టపడ్డ ఫ్యామిలీ స్టార్ మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుందని విజయ్ అభిప్రాయపడ్డారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు