“ఎన్టీఆర్ 31” టైటిల్ పై 2 ఇంట్రెస్టింగ్ అంశాలు.!

“ఎన్టీఆర్ 31” టైటిల్ పై 2 ఇంట్రెస్టింగ్ అంశాలు.!

Published on May 18, 2024 3:05 PM IST


గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు భారీ సినిమా “దేవర” (Devara) సహా “వార్ 2” (War 2) చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలతో పాటుగా సెన్సేషనల్ కాంబినేషన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాపై కూడా ఎనలేని హైప్ నెలకొంది. ఇక ఈ చిత్రం విషయంలో రీసెంట్ గానే ఒక పవర్ఫుల్ టైటిల్ “డ్రాగన్” ని లాక్ చేసారని కొన్ని వార్తలు వైరల్ గా మారాయి.

అయితే ఇప్పుడు ఇదే టైటిల్ సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. మొదటగా ఈ చిత్రానికి టైటిల్ ఇప్పుడు లాక్ అయ్యింది కాదట ఎప్పుడో 2022 లోనే లాక్ అయ్యినట్టుగా వినిపిస్తుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar) ని రిక్వెస్ట్ చేయగా అప్పటికే తాను రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ని తారక్ కోసం తన మీద ఉన్న అభిమానంతో కరణ్ వదులుకున్నాడని తెలుస్తుంది.

ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇదే “డ్రాగన్” టైటిల్ ని తమిళ్ సినిమా వాళ్ళు కూడా లాక్ చేసుకున్నారట. యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (లవ్ టుడే ఫేమ్) తో సినిమాకి ఓ దర్శకుడు లాక్ చేసుకున్నాడని ఈ సినిమా తెలుగులో కూడా ఇదే పేరిట రిలీజ్ ప్లాన్ లు చేస్తున్నారనీ కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే ఎన్టీఆర్ 31 టైటిల్ విషయంలో ఆసక్తికర పరిణామాలే చోటు చేసుకున్నాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు