మరో రెండ్రోజుల్లో “సలార్” ట్రైలర్

మరో రెండ్రోజుల్లో “సలార్” ట్రైలర్

Published on Nov 29, 2023 6:13 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీ డిసెంబర్ 22, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను డిసెంబర్ 1 వ తేదీన 19:19 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంకో రెండ్రోజుల్లో ట్రైలర్ రిలీజ్ అవుతుండటం తో ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు.

హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ భారీ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు