మెగా హీరో కోసం కథలు ఎదురుచూస్తున్నాయట

మెగా హీరో కోసం కథలు ఎదురుచూస్తున్నాయట

Published on Oct 23, 2019 7:37 PM IST

sai dharam tej1

వరుస పరాజయాల తర్వాత ‘చిత్రలహరి’తో విజయాన్ని అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ విజయంతో ఆయనలో కొత్త ఉత్సాహం నెలకొంది. వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నారు. కొత్త కథలను వింటున్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత సినిమాని కూడా సెట్ చేసుకున్నారు.

అదే ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేయనున్నాడు. ఇది కాకుండా తేజ్ ఇంకో రెండు మూడు కథలని సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాడట. అన్నీ కుదిరితే అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి పట్టాలెక్కే అవకాశముంది. ఇండస్ట్రీ టాక్ మేరకు మారుతి, సుబ్బు కథలు మంచి కథలని, అవి తప్పకుండా తేజ్ కు విజయాల్ని ఇస్తాయని తెలుస్తోంది.

తాజా వార్తలు