తెలుగు లో రీమేక్ కానున్న ‘2 స్టేట్స్’ ?

తెలుగు లో రీమేక్ కానున్న ‘2 స్టేట్స్’ ?

Published on May 21, 2014 3:00 AM IST

Two-states (1)
చేతన్ భగత్ నవల ఆధారంగా హింది లో నిర్మింపబడిన ‘2 స్టేట్స్’ గత నెల విడుదల అయ్యి మంచి విజయం సాదించింది. ఈ చిత్రం లో ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ బాషల్లో లో రీమేక్ చేయనున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత పి.వి.పి ఈ చిత్ర హక్కులు సంపాదించారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ఇతర సమాచారం అందుబాటులోలేదు. బహుశ పి.వి.పి ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తారు. అన్ని వర్గాల వారిని అక్కట్టుకునే కధ వుండడం వల్ల ఈ చిత్రం తెలుగు లో కూడా మంచి విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మక్కం గా వున్నారు.

తాజా వార్తలు