“RRR” : రెండేళ్లు అయిపోయింది కానీ ఆ రెండో వెర్షన్ ఎప్పుడు?

“RRR” : రెండేళ్లు అయిపోయింది కానీ ఆ రెండో వెర్షన్ ఎప్పుడు?

Published on Mar 26, 2024 8:00 AM IST

గ్లోబల్ హీరోస్ రామ్ చరణ్ (Ram Charan) అలాగే ఎన్టీఆర్ (Jr NTR) లు హీరోలుగా ఇండియాస్ ప్రైడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన సెన్సేషనల్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం వచ్చి నిన్నటితో రెండేళ్ళు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో చిత్ర యూనిట్ సహా అభిమానులు కూడా మళ్ళీ వెనక్కి సమయాన్ని రివైండ్ చేసుకున్నారు.

మరి ఈ సమయంలో చాలా అంశాలే గుర్తుకొచ్చాయి కానీ స్వయంగా రాజమౌళి చెప్పిన మరో వెర్షన్ మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదని చెప్పాలి. గతంలో RRR ప్రమోషన్స్ లోనే తాను మాట్లాడుతూ ఒరిజినల్ గా సినిమా ఎంతో సీరియస్ గా ఇంటెన్స్ గా ఉంటుందో దీనికి ఫన్ వెర్షన్ కూడా ఉందని సినిమా షూటింగ్ టైం లోనే తన టీం తో కలిసి RRR కి ఇంకో వెర్షన్ కూడా రికార్డు చేశామని..

ప్రతి సీన్ కి ఇంకో వెర్షన్ ఉంటుంది ఇది మాత్రం చాలా ఫన్ గా ఉంటుంది అని అది థియేట్రికల్ రిలీస్ తర్వాత మంచి టైం చూసి రిలీజ్ చేస్తామని తెలిపారు. కానీ ఇప్పుడు సినిమా వచ్చే రెండేళ్లు అయ్యిపోయింది అయినా ఆ కామెడీ వెర్షన్ మాత్రం ఇంకా రాలేదు. మరి జక్కన్న అండ్ టీం ఎప్పుడు దీనిని రిలీజ్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు