టాకీ పార్ట్ ను పూర్తి చేసుకున్న’యు టర్న్’

samantha

వరుస విజయాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి సమంత అక్కినేని ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ‘ యు టర్న్’ అనే చిత్రంలో నటిస్తోంది. టాకీ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది. కన్నడలో మంచి విజయం సాధించిన ‘యు టర్న్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన పవన్ కుమారే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

Exit mobile version