రీ రిలీజ్ కి రెడీ అవుతోన్న ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ మూవీస్ ?

రీ రిలీజ్ కి రెడీ అవుతోన్న ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ మూవీస్ ?

Published on Feb 26, 2024 11:48 PM IST

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గతంలో నటించిన సినిమాల్లో ఆయనకు బాగా క్రేజ్ తెచ్చిపెట్టినవి నువ్వు నేను, మనసంతా నువ్వే. ఇవి రెండూ కూడా అప్పట్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అయి నటుడిగా ఉదయ్ కిరణ్ కి యువతలో విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. నువ్వు నేను మూవీలో అనిత హీరోయిన్ గా నటించగా తేజ దర్శకత్వం వహించారు. మనసంతా నువ్వే మూవీని విఎన్ ఆదిత్య తెరకెక్కించగా రీమా సేన్ హీరోయిన్ గా నటించారు.

ఇక ఈ రెండూ కూడా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ కావడం విశేషం. మ్యాటర్ ఏమిటంటే, రానున్న మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ రెండు మూవీస్ కూడా రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మనసంతా నువ్వే రీ రిలీజ్ అవుతుందని న్యూస్ రావడం జరిగింది. అయితే పక్కాగా ఈ రెండు మూవీస్ యొక్క రీ రిలీజ్ డేట్స్ కి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానున్నాయట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు