సునీల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో ఠాకూర్ అనూప్ సింగ్, ధన్సిక, కబీర్ దుహన్ సింగ్, శ్రద్ధ దాస్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం ‘ఉద్ఘర్ష’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆర్ దేవరాజ్ నిర్మిస్తున్నారు.
కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ ఎక్కువుగా ఇంగ్లీష్ డైలాగ్ లతో వాయిస్ ఓవర్ లో సాగింది. ట్రేలర్ ను చూస్తుంటే.. ఈ సినిమా ముఖ్యంగా యాక్షన్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ అని అనిపిస్తోంది.
ఇక ఈ చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్ కు సప్సెన్స్ చిత్రాలను బాగా తీస్తాడని పేరు ఉంది. గతంలో ఆయన తీసిన కొన్ని సినిమాలు తెలుగులో అనువాదం అయ్యాయి.
కాగా ఈ చిత్రాన్ని డి క్రియేషన్స్ పతాకం పై డి మంజునాథ్, రాజేంద్ర కుమార్ సహా నిర్మాతలుగా.. ఆర్.దేవరాజ్ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
