
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ అనే సినిమా చేస్తున్న సంగతి విథితమే. ప్రస్తుతం హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం త్వరలో ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ల పర్యవేక్షణలో మరొక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించనుంది.
తాజా సంమాచారం మేరకు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఉగాది కానుకగా మార్చి 18న విడుదలచేసే ఆలోచనలో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మాళవిక శర్మ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్ళూరి నిర్మిస్తుండగా ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ సంగీతాన్ని అందిస్తున్నారు.