బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ కి సిద్దమయిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా

బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ కి సిద్దమయిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా

Published on Jul 27, 2012 3:48 AM IST


మంచు మనోజ్ కుమార్ మరియు బాలకృష్ణలు ప్రధాన పాత్రలలో రానున్న చిత్రం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” భారీ ఓపెనింగ్స్ సాదించడానికి సకలం సిద్దమయ్యింది. 23.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మనోజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిలిచింది. అంతే కాకుండా మనోజ్ కెరీర్లోనే భారీ ఎత్తున విడుదల అవుతున్న చిత్రం కూడా ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 450 థియేటర్లలో విడుదల చెయ్యనున్నారు. యుఎస్ లో 40 థియేటర్లలో విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్రం గురించి సానుకూల స్పందన కనిపిస్తుండడంతో ఇప్పటికే పలు చోట్ల ఈ వారాంతపు టికెట్లు అమ్ముడుపోయాయి. శేఖర్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్ష్మి మంచు నిర్మించారు. మనోజ్,బాలకృష్ణ, లక్ష్మి మంచు, సోను సూద్, దీక్షా సెత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. బోబో శశి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు