
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన రెండవ సినిమా ‘ఉలవచారు బిర్యాని’. ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా గత సంవత్సరం విడుదలై అన్ని భాషల్లో బాక్స్ ఆఫీసు వద్ద మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన ‘సాల్ట్ అండ్ పెప్పర్’ సినిమాకి రీమేక్. తాజా సమాచారం ప్రకారం ప్రకాష్ రాజ్ ఈ సినిమాని హిందీలో రీమేక్ చెయ్యనున్నాడనే వార్తలు వినపడుతున్నాయి.
ఈ సినిమా కోసం ప్రకాష్ రాజ్ హిందీ మరియు మరాఠీలో బాగా ఫేమస్ అయిన నానా పటేకర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. నానా పటేకర్ కూడా ఈ సినిమా కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ కుదిరితే ఓ మంచి సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులు ఆశించవచ్చు.