అఖిల్ – భాస్కర్ సినిమా జూలై 15 నుండే.. !

అఖిల్ – భాస్కర్ సినిమా జూలై 15 నుండే.. !

Published on Jul 2, 2019 2:59 AM IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కాస్టింగ్ మొత్తం పూర్తయింది. ఒక్క హీరోయిన్ తప్ప. అయితే గత నెల 26 నుంచి మొదటి షెడ్యూలు కూడా మొదలు కావాల్సి ఉంది. అయితే ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఫైనల్ కాకపోవడం వల్ల ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ఈ నెల 15న నుండి మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం చిత్రబృందం హీరోయిన్ ను ఫైనల్ చేసే ప్రొసెస్ లో ఉంది. ఆ మధ్య కియరా అద్వానీ లేదా రష్మికా మండన్నలో ఎవరో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

అలాగే అఖిల్ సరసన దాదాపు కొత్త హీరోయిన్ నే ఫైనల్ చెయ్యబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి ఇంతకీ కొత్త హీరోయిన్ ను తీసుకుంటారా లేక రష్మికా మండన్నకే ఫిక్స్ అవుతారా అనేది చూడాలి. ఇక అఖిల్ కి ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు. ఈ సినిమా కూడా భాస్కర్ బొమ్మరిల్లు సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు