అల ఎఫెక్ట్… పుష్ప బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Published on May 9, 2020 7:14 am IST

ఓ మంచి సబ్జెక్టు పడితే అల్లు అర్జున్ బాక్సాఫీస్ ని ఎరేంజ్ లో దున్నేస్తాడో అల వైకుంఠపురంలో మూవీ నిరూపించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురంలో టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో మూడో స్థానంలో నిలిచింది. త్రివిక్రమ్ అండ్ బన్నీల హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. దీనితో బన్నీ పుష్ప మూవీ కోసం నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించనున్నారట. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ చాలా రిచ్ గా ఉండనుందని వినికిడి. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 6 కోట్ల బడ్జెట్ కేటాయించారట. అడవిలో సాగే ఆ భారీ ఛేజింగ్ సన్నివేశం కోసం పెద్ద ఎత్తున వాహనాలు వాడనున్నారని సమాచారం.

ఇక పుష్ప బడ్జెట్ 120-150 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తున్న సమాచారం. గతంలో బన్నీ సినిమాల బడ్జెట్ తో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. ఇక రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సుకుమార్ ఎప్పటిలాగే మ్యూజిక్ బాధ్యతలు దేవిశ్రీకి అప్పగించారు.

సంబంధిత సమాచారం :