ఈసారి “అల వైకుంఠపురములో”కు దెబ్బ పడిందట.!

Published on Nov 27, 2020 3:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ చిత్రం ఊహించని విధమైన రికార్డులను అన్ని క్యాటగిరీలలో నెలకొల్పింది. ఇక మ్యూజిక్ పరంగా అయితే ఇంకా హవా కొనసాగుతుంది.

ఇదిలా ఉండగా ఈ చిత్రం స్మాల్ స్క్రీన్ పై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చెయ్యగా 29.4 టీఆర్పీ తో ఆల్ టైం రికార్డు సెట్ చెయ్యగా సెకండ్ టెలికాస్ట్ పై కూడా ఇండస్ట్రీ వర్గాల కన్ను పడింది. ఎందుకంటే మొట్ట మొదటిసారిగా భారీ టీఆర్పీ వస్తే రెండో సారి కూడా అందుకు తగ్గట్టుగానే ప్రిస్టేజియస్ గా వస్తుందని తీసుకుంటారు.

కానీ అనూహ్యంగా అల వైకుంఠపురములో సినిమా రెండో సారి టెలికాస్ట్ కు దెబ్బ పడింది. ఈసారి కేవలం 7.91 టీఆర్పీ మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది. ఇది మాత్రం బాగా తక్కువే అని చెప్పాలి. గత దీపావళికి టెలికాస్ట్ చేయబడిన ఈ సినిమా అంత మొత్తం నుంచి ఇంత తక్కువకు పడిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

సంబంధిత సమాచారం :

More