సంచలన రికార్డ్ సెట్ చేసుకున్న బాలయ్య “అన్‌స్టాపబుల్” షో..!

Published on Feb 9, 2022 12:00 am IST

నందమూరి బాలకృష్ణ ఆహాలో వచ్చే “అన్‌స్టాపబుల్” టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్లతో బాలయ్య చేసిన సందడి ప్రేక్షకులకు ఫుల్ టూ ఎంటర్‌టైన్‌ని ఇస్తుండడంతో ఈ షో టాప్ రేటింగ్‌తో దూసుకుపోయింది. ఇటీవల జరిగిన మహేశ్ ఎపిసోడ్‌తో ఈ షో మొదటి సీజన్‌ని పూర్తి చేసుకుంది.

అయితే ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న ఈ షో తాజాగా మరో సంచలన రికార్డును సెట్ చేసుకుంది. 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో ఓటీటీ ప్లాట్‌ఫాంలోనే అత్యధికంగా వీక్షించబడిన కార్యక్రమంగా ఈ షో నిలిచింది. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ షో రెండో సీజన్ కూడా ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.

సంబంధిత సమాచారం :