SSMB 29 : సూపర్ స్టార్ మహేష్ మనకు కనిపించేది అప్పటివరకే ?

SSMB 29 : సూపర్ స్టార్ మహేష్ మనకు కనిపించేది అప్పటివరకే ?

Published on Feb 22, 2024 3:01 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ SSMB 29 పై వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ఫ్యాన్స్ అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. తొలిసారిగా ఎస్ ఎస్ రాజమౌళితో మహేష్ చేస్తున్న ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించనుండగా విజయేంద్రప్రసాద్ కథని కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు. త్వరలో ఈమూవీ గురించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఇక ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్నెస్, స్టైలింగ్ పై మరింతగా శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం మహేష్ బాబు ఫుల్ గా క్రాఫ్, గడ్డం పెంచుతున్నారు. విషయం ఏమిటంటే, మరికొద్దిరోజుల అనంతరం ఇకపై కొన్నాళ్ల పాటు మహేష్ బాబు మీడియా ముందు, అలానే సోషల్ మీడియాలో కనిపించరట. ఇప్పటికే తాను ఒప్పుకున్న రెండు యాడ్స్ ని మార్చి మొదటి వారంలో కంప్లీట్ చేసిన అనంతరం పూర్తిగా తన టైంని SSMB 29 మూవీ కోసమే కేటాయించనున్నారట. మరోవైపు ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం కాగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక చేసే పనిలో జక్కన్న అండ్ టీమ్ ఉందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు